Searching...
Friday, 2 August 2013

చైనా వస్తువులు ఎందుకు వాడకూడదు? కొన్ని కారణాలు

 అతి చవుకగా వస్తున్నాయని చైనా వస్తువులు ఇప్పుడు అందరూ వాడుతున్నారు. కానీ అవి వాడడం ద్వారా మనకు అలాగే మిగతా ప్రపంచదేశాలకు ముప్పు పొంచి ఉంది. ఈ విషయాన్ని నేను ఎంతోకాలంగా అందరితో పంచుకోవాలని అనుకుంటూ నా మనసు దోలిచేస్తుంటే ఇప్పుడు చెపుతున్నాను

1.చైనా ఒక కమ్యూనిస్ట్ దేశం. అక్కడ ప్రతీదీ ప్రభుత్వ సొంతం. అలాగే మనం కొనే వస్తువులపైన లాభం కూడా! ఆ లాభంలొ చాలా భాగాన్ని చైనా తన రక్షణాపాటవాన్ని పెంచుకోడానికి ( ముఖ్యంగా అమెరికా, ఇండియా లను దెబ్బతీసేందుకు ) వినియోగిస్తుంది. ఇది భవిష్యత్తులో ప్రపంచం మొత్తానికి నష్టమే.
2. చైనా ఉపయోగించే టెక్నాలజీ ఒక తక్కువరకముది. మొబైళ్ళలోనూ, ఇతర ఆట వస్తువులలోనూ ఉపయోగించే పరికరాలు, సాఫ్ట్వేర్ రిపేరు చెయ్యడాని కూడా వీలుకాకుండాఉంటుంది. దీని ద్వారా మనం మరలా మరలా డబ్బు ఆ చైనాకే తగలేస్తున్నాం.
3. క్రొత్తగా టెక్నాలజీని అభివ్రుద్దిచెయ్యాలనుకున్న ఔత్సాహికులు తమ ఆలోచనలను విరమించుకోవడమో, లేదా వారి టెక్నాలజీకి మూలాధారంగా మళ్ళీ చైనా పరికరాలనే ఉపయోగించడమో చేస్తున్నారు.దీని ద్వారా టెక్నాలజీ బద్దకం ఏర్పడుతోంది.గత కొన్నేళ్ళుగా ప్రపంచమంతా ఇది కనపడుతోంది. ఉదాహరణ: నా చిన్నప్పుడు జపాన్ రేడియో అంటే చాలా గొప్ప. వాళ్ళు ఏది తయారు చేసినా అతి నాణ్యతతో తయరు చేసేవారు ఇప్పుడు జపాన్ ఎక్కడుంది?
4. అతి ప్రమాదకారి అయిన ప్లాస్టిక్ ను ఎలా నాశనం చెయ్యాలా అని ప్రపంచమంతా బుర్రలు బద్దలు కొట్టుకుంటుంటే చైనా అదే ప్లాస్టిక్ ను బొమ్మలు గానో , ఇతర వస్తువులుగానో మర్చి ప్రపంచం పైకి వదిలి మరీ సొమ్ము చేసుకుంటుంది .
5. మిగతా దేశాల లాగ చైనాలో ఏదైనా కనిపెట్టిన తర్వాత దాని లోపాలనూ పర్యవసానాలనూ పరీక్షిస్తూ టైం వేస్ట్ చెసుకొరు. సాద్యమైనంత తొందరగా ప్రపంచం మీదికి వదిలేస్తారు . అందుకే వారు తయారు  చేసిన ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు రేడియేషన్ ను అవసరానికి మించి ఉత్పత్తి  చేస్తుంటాయి .
ఆలోచించే కొలదీ ఇంకా అనేక కారణాలు బయట పడుతాయి . కనుక ప్రభుత్వం సంగతి తర్వాత ముందు మనం చైనా వస్తువులను వాడకుండా ఉండడమే బెట్టర్ . మనకీ మన పిల్లలకీ కూడా .... ఆలోచించండి !!!

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Back to top!