జోడించు' ఆట:
జోడించు" అనేది ప్రత్యేకంగా మేము రూపొందించిన తెలుగు పదక్రీడలకు ఒక ఉమ్మడి పేరు. తెలుగు భాషతో రకరకాలుగా ఆడే వీలు కలిగించే "త్వరగా జోడించు" ఇంకా "జోడించు" అనే రెండు ఆహ్లాదకరమైన ఆటలలో మూలం ఒకటే: సృజనాత్మకత, తెలివితేటలతో అక్షరాల విడి విడి భాగాలను జోడిస్తూ, పదాలు కూర్చి, వీలైనన్ని పాయింట్లు సంపాదించడం. తెలుగు పదాలతో మునుపెన్నడూ ఆడనట్లు ఆడుకోండి!
ఈ ఆటలలో ప్రత్యేక అంశాలు
- తెలుగు భాషలోనున్న ఏ అక్షరమైనా చేయొచ్చు (తప్పనిసరిగా ఉండే ద్విత్వాక్షరాలు/సంయుక్తాక్షరాలతో సహా)
- పదాలను పైనించి క్రిందికి కూర్చినా దృష్టిపరంగా, సాంకేతికంగా సరిగ్గా ఉంటాయి
- కొన్ని గుణింతం గుర్తులను, గుణింతం గుర్తులతో కూడిన కొన్ని అక్షరాలను (’పా’, ’మొ’, ’సో’ లాంటివి) లిపిలోనున్నట్లు చూపించుటకు రిజర్వు బిళ్లలు ఇవ్వబడినవి
- ఆటల్లో వాడే అక్షరాల, గుర్తుల విస్తరణ వాడుక భాషలో ఉన్నట్లే ఉంటుంది
...కూర్చిన పదం సరైనదా కాదా అనే ఆసక్తికరమైన, చర్చించతగ్గ, సరదాతో కూడిన సన్నివేశములు ప్రతి ఆటలోను గోచరించును .... నియమావళిలో ఇచ్చిన సూచనలతో మీకు తట్టిన ఆలోచనలు జోడించి ఆడండి. ఎలాగైనా, పదాలను సరదాగా కూరుస్తూ ఆటను ఆనందించండి.
చిన్నలకు, పెద్దలకు ఎవరికైనా ఎన్నో
జోడించు' ఆట

0 comments:
Post a Comment